జహీరాబాద్ పట్టణంలోని రాయల్ కోర్ట్ ఫంక్షన్ హాల్‌లో మానూర్ మండల కేంద్రానికి చెందిన గ్రామ సర్పంచ్ రమ్య సిద్ధారెడ్డి దంపతుల కుమారుని నామకరణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నారికి నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే రమ్య సిద్ధారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బోజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, బిరాధర్ దత్తు, మానూర్ మండల కాంగ్రెస్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు, శివాజీ పటేల్, సంగమేశ్వర పటేల్, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సర్పంచులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రమ్య సిద్ధారెడ్డి కుమారుని నామకరణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి