Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / జహీరాబాద్

గణేష్‌పూర్‌ శివారులో అక్రమ తవ్వకాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Updated : 21 Nov 2026 18:08 IST
As Preferred Source 1 min read
గణేష్‌పూర్‌ శివారులో అక్రమ తవ్వకాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: డీఎస్పీ సైదా నాయక్

న్యాల్‌కల్ మండలంలోని గణేష్‌పూర్‌ గ్రామ శివారులో తరచూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో శనివారం ఉదయం జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని నిమ్స్ అధికారుల నుంచి ఫిర్యాదు అందడంతో డీఎస్పీ, జహీరాబాద్ గ్రామీణ సీఐ నర్సింహులు, హద్నూర్ పోలీస్ సిబ్బందితో కలిసి గణేష్‌పూర్‌ గ్రామ శివారు ప్రాంతాన్ని పరిశీలించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారనే అనుమానం ఉన్న వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సైదా నాయక్ మాట్లాడుతూ ఎవరైనా చట్టవ్యతిరేకంగా అక్రమ తవ్వకాలు చేపడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అక్రమ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, చట్టాన్ని గౌరవిస్తూ నడుచుకోవాలని సూచిం

చారు.

Sthanikam

గణేష్‌పూర్‌ శివారులో అక్రమ తవ్వకాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి