కోదాడ మండలం రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులను రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. రూ.47.64 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా ఆరు గ్రామాల్లోని 4,460 ఎకరాలకు ఖరీఫ్, రబీ సీజన్లలో సాగునీరు అందించనున్నారు.మొత్తం 1,486 రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.ఈ సందర్భంగా కాలువలు, అండర్‌గ్రౌండ్ మోటార్లు, సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను మంత్రి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.మిగిలిన పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని,నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నర్సింహా, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై మంత్రి సమీక్ష
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి