Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:06 AM

పోలీస్ నియామకాలలో విశేష సేవలు – కళ్యాణికి అభినందనలు

22-04-2026 222 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా పోలీస్ కార్యాలయం (డి.పి.ఓ)లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహించిన ఇ. కళ్యాణి హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఎస్పీ మాట్లాడుతూ, ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజమని, గత మూడు సంవత్సరాలుగా కళ్యాణి బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ నియామకాల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. కొత్తగా చేరిన కానిస్టేబుళ్లకు తొలి నెలలోనే వేతనం అందేలా చేసిన ఆమె కృషి ప్రశంసనీయమన్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లో కూడా ఇదే విధంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.కళ్యాణి మాట్లాడుతూ, తన విజయానికి డి.పి.ఓ సిబ్బంది సహకారమే కారణమని, అందరి ప్రేమను ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీస్ నియామకాలలో విశేష సేవలు – కళ్యాణికి అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News