సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ధాన్యం పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, పిఏసిఎస్ ఛైర్మన్ ఈడ్పుల మస్తాన్ బాబు యాదవ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లో 'శ్రీ ఆంజనేయ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్' పంతంగి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (పీపీసీ) శనివారం వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడుతూ.. ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంపై తప్పనిసరిగా టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. ధాన్యంలో తాలు, పొల్లు లేకుండా బాగా ఆరబెట్టి, శుభ్రపరిచి కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం సూచించిన విధంగా సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్ పల్లె లావణ్య - సురేందర్ రెడ్డి, పిఏసిఎస్ వైస్ ఛైర్మన్ పర్ని శివారెడ్డి, ఏఎంసి డైరెక్టర్లు ఎండీ. గౌస్ ఖాన్, పబ్బు శ్రీకాంత్, పిఏసిఎస్ డైరెక్టర్లు సుర్కంటి లక్ష్మమ్మ, మేకల దేవేందర్ రెడ్డి, బొబ్బిల్ల రాజేందర్, ఎర్ర పెంటయ్య, నాయకులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, బోయ దేవేందర్, సుర్కంటి యాదిరెడ్డి, చెన్నగోని అంజయ్య గౌడ్, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, కో-ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫీసర్ కే. సురేష్, ఏఎంసి కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఏటీఓ కృష్ణ, ఎఫ్ పిఓ పంతంగి ఛైర్మన్ శాగ రఘునందన్ రెడ్డి, స్థానిక రైతులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి