నవంబర్ 2 నుంచి పంటల పరిశీలనకు ఏఈవోలు..
మునగాల మండలాన్ని 2026-27కు కరువు మండలంగా ప్రకటించడంతో పంట నష్టాల గుర్తింపు ప్రక్రియకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. నవంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు గ్రామాల్లో పర్యటించే ఏఈవోలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, 33 శాతానికి పైగా నష్టం జరిగిన పంటల వివరాలను నమోదు చేయనున్నారు.
సర్వేలో గుర్తించిన అర్హులైన రైతుల జాబితాను నవంబర్ 9న గ్రామపంచాయతీల్లో ప్రదర్శించనున్నారు.రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది వివరాలను నవంబర్ 10వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిస్తామని మండల వ్యవసాయ అధికారి రాజు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి