సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీనియర్ సివిల్ జడ్జి కె. సురేష్ అన్నారు.కోదాడ పట్టణంలోని తేజ టాలెంట్ స్కూల్‌లో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తెలిసీ తెలియక చేసే తప్పులు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు రికార్డుల్లో పేరు నమోదైతే ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.విద్యార్థులు చెడు స్నేహాలు, అలవాట్లకు దూరంగా ఉండి మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం పోక్సో చట్టం, బాలల రక్షణ, ఇతర న్యాయపరమైన అంశాలు,చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షల గురించి వివరించారు.ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సమాజంలో జరిగే అన్యాయాలను గుర్తించి సరైన మార్గంలో స్పందించగలరని తెలిపారు.
బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రామ్మూర్తి, న్యాయవాదులు కన్నం సాబ్, నాగులపాషా, హుస్సేన్, లీగల్ పారాలీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి