Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు. దేశ సమగ్రతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం

Updated : 31 Oct 2026 17:15 IST
As Preferred Source 1 min read
ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు.  దేశ సమగ్రతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం

స్థానికం: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ సేవా పథకం, మై భారత్ కేంద్రం, యాదాద్రి భువనగిరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్. రత్న మంజుల మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారత తొలి ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అకడమిక్ కోఆర్డినేటర్, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ డి. కిషన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో బార్డోలి సత్యాగ్రహాన్ని విజయవంతం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశంలోని 500కు పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంతోపాటు హైదరాబాద్ సంస్థానం విలీనానికి ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు.

కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ జె. చిన్నబాబు, డాక్టర్ జి. సునీత, అధ్యాపకులు డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, ఎం. అనిత, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ల శ్రీను, అమర్, నరేష్, రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు. దేశ సమగ్రతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి