హైదరాబాద్ నుంచి నల్లగొండకు ప్రయాణించిన సత్తమ్మ అనే మహిళ తన బ్యాగులను బస్సులో మర్చిపోయింది.ఆ బ్యాగుల్లో బంగారు గొలుసు, మందులు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి.మరుసటి రోజు విధి నిర్వహణలో భాగంగా బస్సును పరిశీలించిన డ్రైవర్ G. వినయ్ (B/6420) బ్యాగులను గుర్తించారు. వాటిని తన వద్ద భద్రపరిచి, నల్లగొండ స్టేషన్ మేనేజర్ B. నరేందర్‌కు సమాచారం అందించారు. అనంతరం ఆయన సమక్షంలో సదరు మహిళకు బ్యాగులను యథాతథంగా అప్పగించారు.విలువైన వస్తువులు దొరికినా వాటిపై ఆశపడకుండా, బాధ్యతతో వాటిని యజమానికి తిరిగి అందించిన డ్రైవర్ వినయ్ నిజాయితీ, మానవత్వం పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.ఈ సందర్భంగా కోదాడ డిపో మేనేజర్ బి. శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ P. నాగశ్రీతో పాటు డిపో సిబ్బంది డ్రైవర్ వినయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
డబ్బు, బంగారం కంటే నిజాయితీ గొప్పదని చాటిన ఆర్టీసీ డ్రైవర్!
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి