Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:18 AM

ప్రజల ఆశీస్సులతో చైర్మన్‌గా నగేష్ కుమార్ షేట్కార్ రేపు బాధ్యతల స్వీకారం

15-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 15 వార్డుల్లో 11 వార్డులను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఈ విజయంతో నారాయణఖేడ్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయబడుతోంది.ఎనిమిదో వార్డు నుండి భారీ మెజార్టీతో గెలుపొందిన ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ సోమవారం 16వ తేదీన మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో నారాయణఖేడ్ సర్పంచ్‌గా, కంగ్టి మండల జడ్పిటిసి‌గా ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన ఆయన ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవిని అలంకరించబోతుండడం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.ఈ విజయానికి తోడ్పడిన ప్రముఖుల్లో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి,పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్,యువత నాయకులు సాగర్ షేట్కార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్, తదితర నాయకుల కృషి విశేషంగా నిలిచింది. వారి సమిష్టి ప్రయత్నాలు, కార్యకర్తల శ్రమ, ప్రజల ఆశీర్వాదం కలిసి కాంగ్రెస్ పార్టీకి ఈ విజయాన్ని అందించాయి.మున్సిపల్ కార్యాలయంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాల్లో సంబరాలు, ఆనందోత్సవాలు నెలకొన్నాయి.మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని వార్డు వారీగా అమలు చేసి పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని నగేష్ కుమార్ సెట్ కార్ గారు స్పష్టం చేశారు. మహిళలు, యువత, విద్యావంతులు, మేధావులు—అందరూ ఆయన నాయకత్వంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కొత్త అభివృద్ధి అధ్యాయం ప్రారంభమవుతున్న ఈ వేళ, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కొత్త చైర్మన్ నాయకత్వం సాగాలని అందరూ ఆశిస్తున్నారు.

Sthanikam

ప్రజల ఆశీస్సులతో చైర్మన్‌గా నగేష్ కుమార్ షేట్కార్ రేపు బాధ్యతల స్వీకారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News