Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ప్రభుత్వ పాఠశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Updated : 04 Nov 2026 15:58 IST
As Preferred Source 1 min read
ప్రభుత్వ పాఠశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

తూప్రాన్‌పేట బడిలో మధ్యాహ్న భోజనం తిన్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

కనీస వసతులు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు

తూప్రాన్‌పేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ గ్రామ శాఖ కార్యదర్శి లవణం సాత్విక్ డిమాండ్ చేశారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నాయకులు బడిని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోనే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యత, మెనూ అమలు, పాఠశాలలో మౌలిక వసతుల లభ్యతపై వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా సాత్విక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని, దీనివల్ల మధ్యాహ్న భోజన నిర్వహణ కూడా సక్రమంగా సాగడం లేదని చెప్పారు. సర్కారు పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, ఆటలు ఆడుకునేందుకు ఆటస్థలాన్ని కేటాయించాలని కోరారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడిలో తగినంత మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం విద్యావ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతోందని విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి, విద్యావ్యవస్థ బలోపేతానికి సహకరించాలని సూచించారు.

​ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజు, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి