యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆంజనేయులు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు మొహమ్మద్ షానూర్ బాబా బుధవారం ఆంజనేయులు నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం కారణంగా ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచిస్తూ మనోధైర్యం కల్పించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో టీజేఏ మండల అధ్యక్షుడు షేక్ బురాన్ పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి