విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించిన ఏఎస్‌డబ్ల్యూఓ సుమంత్
తల్లిదండ్రులు, బాధ్యులతో కలిసి సహపంక్తి భోజనం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
నేలపట్ల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించారు. అందిన ఫిర్యాదుల మేరకు మంగళవారం అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏఎస్‌డబ్ల్యూఓ) ఎ. సుమంత్ హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహంలో కల్పించిన సౌకర్యాలు, నెలకొన్న సమస్యలపై విద్యార్థులు, సిబ్బందితో నేరుగా మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది, సమాచార హక్కు రక్షణ చట్టం (2005) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ గౌడ్ సమక్షంలో అధికారులు విద్యార్థులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపారు. అనంతరం అధికారులతో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిన్నర్ (సహపంక్తి భోజనం) కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. హాస్టల్‌లో విద్యార్థుల భద్రత, సమస్యలపై తాము చేసిన ఫిర్యాదుకు తక్షణమే స్పందించి తనిఖీ చేపట్టిన ఏఎస్‌డబ్ల్యూఓ సుమంత్, జిల్లా బాలల సంరక్షణ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల హక్కులు, సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది, ఇతర అధికారులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి