Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

యువతలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి యూత్‌ పార్లమెంట్‌ వేదిక

Updated : 03 Nov 2026 20:48 IST
As Preferred Source 1 min read
యువతలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి యూత్‌ పార్లమెంట్‌ వేదిక

భావి భారత పౌరులైన యువతకు ప్రజాస్వామ్య పాలన, పార్లమెంటు పనితీరు, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ‘వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ 2026–27’ కార్యక్రమానికి కోదాడలో ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మంగళవారం కార్యక్రమానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.మై భారత్‌ కేంద్రం సూర్యాపేట జిల్లా నిర్వాహకుల ఆధ్వర్యంలో నవంబర్‌ 4న సూర్యాపేటలోని ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కోదాడలోని కేఆర్‌ఆర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, మై భారత్‌ కేంద్రం జిల్లా ఇన్‌చార్జి దిగూటి భవాని నేతృత్వంలో పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రణబోతు పిచ్చిరెడ్డి మాట్లాడుతూ..యువత ప్రజాస్వామ్య వ్యవస్థపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. యూత్‌ పార్లమెంట్‌ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, వాక్చాతుర్యం, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Sthanikam

యువతలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి యూత్‌ పార్లమెంట్‌ వేదిక

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి