Sthanikam - Truth Matters
Logo

పేకాట, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు: ఎస్‌ఐ చైతన్య కిరణ్

Updated : 03 Nov 2026 20:47 IST
As Preferred Source 1 min read
పేకాట, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు: ఎస్‌ఐ చైతన్య కిరణ్

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని షాపూర్, పాంపాడ్ గ్రామాల శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై మంగళవారం పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. షాపూర్ గ్రామ శివారులో 6 మందిని, పాంపాడ్ గ్రామ శివారులో 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,010 నగదు, 10 సెల్‌ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాయికోడ్ ఎస్‌ఐ చైతన్య కిరణ్ తెలిపారు. మండల పరిధిలో ఎక్కడైనా పేకాట లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు వారికి సహకరించే వారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు పేకాట, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి వాటి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్‌ఐ కోరారు.

Sthanikam

పేకాట, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు: ఎస్‌ఐ చైతన్య కిరణ్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి