Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడ నియోజకవర్గంలో చలి తీవ్రత పెరుగుదల.. చిరుజల్లులతో ప్రజల అవస్థలు

Updated : 03 Nov 2026 20:48 IST
As Preferred Source 1 min read
కోదాడ నియోజకవర్గంలో చలి తీవ్రత పెరుగుదల.. చిరుజల్లులతో ప్రజల అవస్థలు

కోదాడ నియోజకవర్గ పరిధిలో మంగళవారం మురసు తుఫాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి.దీంతో వాతావరణం చల్లబడటంతో చలి తీవ్రత పెరిగింది.అకాల వర్షపు జల్లులు, చల్లటి గాలుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలికి వణికిపోయారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.మరోవైపు చిరుజల్లుల కారణంగా రహదారులు తడిగా మారి వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సి వచ్చింది. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు చలి, వర్షపు జల్లులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ మార్పులతో కోదాడ నియోజకవర్గంలో ఒక్కసారిగా చల్లటి వాతావరణం నెలకొంది.

Sthanikam

కోదాడ నియోజకవర్గంలో చలి తీవ్రత పెరుగుదల.. చిరుజల్లులతో ప్రజల అవస్థలు

Article Image

కోదాడ నియోజకవర్గ పరిధిలో మంగళవారం మురసు తుఫాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి.దీంతో వాతావరణం చల్లబడటంతో చలి తీవ్రత పెరిగింది.అకాల వర్షపు జల్లులు, చల్లటి గాలుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలికి వణికిపోయారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.మరోవైపు చిరుజల్లుల కారణంగా రహదారులు తడిగా మారి వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సి వచ్చింది. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు చలి, వర్షపు జల్లులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ మార్పులతో కోదాడ నియోజకవర్గంలో ఒక్కసారిగా చల్లటి వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి