నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటన.. శాఖాపరమైన విచారణకు ఆదేశం.
నల్లగొండ: నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో సీజ్ చేసిన వాహనాలను అక్రమంగా విక్రయించిన ఘటనలో కానిస్టేబుల్ సైదులుపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. కరోనా సమయంలో పోలీసులు సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను సైదులు విక్రయించినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించారు. వెంటనే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని పోలీస్ శాఖ వెల్లడించింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి