యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కాటమయ్య స్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. గౌడ సంఘం చైర్మన్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్, ముస్తాది దారుడు వీరమల్ల భిక్షం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా సాగింది.
సిద్ధాంతి బేతాజీ సత్యనారాయణ శాస్త్రి, దీక్షితులు శశిధర్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన గౌడ కులస్తులు, కుల పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తితో పూజల్లో పాల్గొన్నారు.కాటమయ్య స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ నిర్మాణం చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి