Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:40 AM

పోతనపల్లిలో లయన్స్ క్లబ్ సహకారంతో పేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

04-01-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మండల పరిధిలోని పోతనపల్లి (R) గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో గ్రామానికి చెందిన నాయకుడు మల్లేష్ కుటుంబానికి శనివారం నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి సహాయం అందించడం అభినందనీయమని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. సమాజ సేవలో భాగంగా లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు గ్రామానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ నాయకులు, గ్రామస్తులు లయన్స్ క్లబ్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు, చల్ల సాయి రెడ్డి, చల్ల గోపాల్ రెడ్డి, ఉప్పరి మారుతి, ఉప్పరి కాశీరాం, తుమ్నూర్ సిద్ధు, పుచ్చ నగేష్, నాయకుడు శ్రీను, కుందేల్ విట్టల్, నాయకుడు సంగన్న, నీరుడి నాగయ్యతో పాటు గ్రామ వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పోతనపల్లిలో లయన్స్ క్లబ్ సహకారంతో పేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మండల పరిధిలోని పోతనపల్లి (R) గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో గ్రామానికి చెందిన నాయకుడు మల్లేష్ కుటుంబానికి శనివారం నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి సహాయం అందించడం అభినందనీయమని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. సమాజ సేవలో భాగంగా లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు గ్రామానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ నాయకులు, గ్రామస్తులు లయన్స్ క్లబ్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు, చల్ల సాయి రెడ్డి, చల్ల గోపాల్ రెడ్డి, ఉప్పరి మారుతి, ఉప్పరి కాశీరాం, తుమ్నూర్ సిద్ధు, పుచ్చ నగేష్, నాయకుడు శ్రీను, కుందేల్ విట్టల్, నాయకుడు సంగన్న, నీరుడి నాగయ్యతో పాటు గ్రామ వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News