Sthanikam - Truth Matters
Logo

నూతన గృహప్రవేశ వేడుకలో కుటుంబ సభ్యులకు ఘన సత్కారం

Updated : 01 Nov 2026 19:01 IST
As Preferred Source 1 min read
నూతన గృహప్రవేశ వేడుకలో కుటుంబ సభ్యులకు ఘన సత్కారం

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన మడుపతి ఇంద్రమ్మ–సంగయ్య స్వామి దంపతుల నూతన గృహప్రవేశ వేడుకను ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సంఘం నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయికోడ్ మండల వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు సింగీతం మడుపతి శంకరయ్య స్వామి, సంఘం అధ్యక్షులు కర్చల్ దాడువై పవన్ కుమార్, సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సింగీతం రవీందర్, న్యాలకంటి గణపతి, సమాజం కార్యవర్గ సభ్యులు మాలిపట్లోల్ల ధనుంజయ పాటిల్, అల్లాపూర్ నాగరాజ్ పాటిల్, నర్సింలు స్వామి తదితరులు హాజరై నూతన గృహాన్ని సందర్శించి గృహ యజమాని సంగయ్య స్వామి దంపతులను, వారి కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని చిత్రపటాన్ని బహుమతిగా అందజేసి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన గృహంలో కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, ఆ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సంఘం నాయకులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ వేడుకతో అల్లాపూర్ గ్రామంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంది.

Sthanikam

నూతన గృహప్రవేశ వేడుకలో కుటుంబ సభ్యులకు ఘన సత్కారం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి