Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

గుర్తుతెలియని వాహనం ఢీకొని కిరాణా వ్యాపారి మృతి

Updated : 01 Nov 2026 18:53 IST
As Preferred Source 1 min read
గుర్తుతెలియని వాహనం ఢీకొని కిరాణా వ్యాపారి మృతి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని కిరాణా వ్యాపారి దుర్మరణం చెందిన సంఘటన చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ డి.సతీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...చౌటుప్పల్ టౌన్‌లోని రత్ననగర్ కాలనీకి చెందిన కొర్లపార రాము (59) కిరాణా షాపు నిర్వహిస్తుంటారు. ఆయన ఆదివారం ఉదయం 7:30 గంటల సమయంలో టిఫిన్ చేసి వాకింగ్‌కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో కొయ్యలగూడెం శివారులోని 'ఎపీటం వెంచర్' సమీపంలో రోడ్డు దాటుతుండగా, విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఓ గుర్తుతెలియని వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది.​ఈ ప్రమాదంలో రాము తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయమవ్వడంతో పాటు ఎడమవైపు ప్రక్కటేముకలు, ఎడమ చేయి విరిగాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా ఆయనను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డ్యూటీ డాక్టర్ ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు.

Sthanikam

గుర్తుతెలియని వాహనం ఢీకొని కిరాణా వ్యాపారి మృతి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి