Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 11:37 PM

నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్లే నిత్యం రోడ్డు ప్రమాదాలు

నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్లే నిత్యం రోడ్డు ప్రమాదాలు

నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్లే నిత్యం రోడ్డు ప్రమాదాలు
April 16, 2026 09:39 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రతి ఒక్కరూ నిబందనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదలను అరికట్టాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం మునగాల మండల పరిది ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించకుండ నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువ మంది మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందిన వారే ఉన్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపటంతో రోడ్డు ప్రమాదంలో గాయాలై ఆసుపత్రి పాలై మృతి చెందడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు తెలిపారు. చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. నేటి యువత రేపటి దేశ భవిష్యత్తు అని రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, తమ కుటుంబ సభ్యులకు, తమ స్థానిక ప్రాంతాల్లోని వ్యక్తులకు రోడ్డు భద్రత నియమాల గురించి తెలియజేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, పోలీస్ , రవాణా, ఇతర శాఖలు సంయుక్తంగా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కూల్ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చేతులు బయట పెట్టవద్దన్నారు. రోడ్డు నియమాలు పాటించేలా పిల్లలు తల్లిదండ్రులకు తెలపాలని, రోడ్డు భద్రత నియమలపై స్కూల్ లో పాఠాలు చెప్పాలని స్కూల్ అధికారులను కలక్టర్ సూచించారు.


హెల్మెట్ & సీట్ బెల్ట్ తప్పనిసరి – ఎస్పీ నరసింహ

రోడ్డుపై వాహనాలు నడిపే వారు రోడ్డు నిబంధనలు పటిస్తూ సురక్షితంగా మీమీ గమ్యలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. రోడ్డుపై బైకులు, స్కూటీలు నడిపే వారు క్రమం తప్పకుండా వాహనము నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలన్నారు. కార్ నడిపే వారు సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడపరాదు అన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్‌ ధరించకుండా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనాలు నడిపే వారు ఇంటి వద్ద మీ కొసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారన్న విషయం గుర్తుంచుకోని వాహనాలు నడపాలన్నారు. వాహనం నడిపే వారు ప్రతి ఒక్కరు రోడ్డు నియమనిబంధనలు పాటించాలన్నారు. రోడ్డుపై నిత్యం జరిగే ప్రమాదాలు హెల్మెట్ లేకుండా వాహనము తోలడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీట్ బెల్ట్ వినియోగించకుండా వాహనం నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. వాహనాల తనిఖీల్లో పోలీస్ అధికారులను చూసి కొంతమంది వాహనదారులు తప్పించుకొని పారిపోయే క్రమంలో సైతం ప్రమాదాలు జరుతున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటారు తప్ప పోలీస్ అధికారుల మాదిరిగా ఉండరు అన్నారు. ప్రజలు బాగుండడం కోసమే పని చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు, పాఠశాల బస్సు డ్రైవర్లకు, ఉపాధ్యాయులకు, పాత్రికేయులకు హెల్మెట్లు అందించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి బాధ్యతగా సీట్ బెల్ట్ ధరించి అందరికీ సూచనలు చేశారు.


ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్, ఎస్ఐ అజయ్, స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వర రావు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

---------------------------------

జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట వారిచే జారీ చేయనైనది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News