Sthanikam - Truth Matters
Logo

నేరడిగుంట బిడ్డకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. భావనకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు

Updated : 26 Oct 2026 15:05 IST
As Preferred Source 1 min read
నేరడిగుంట బిడ్డకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. భావనకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన పట్లోళ్ల మహేశ్వరి, వైద్యనాథ్ (రాజు) పటేల్ దంపతుల కుమార్తె పట్లోళ్ల భావన విద్యారంగంలో అద్భుత ప్రతిభ కనబరిచి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ముంబైలో జరిగిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ వార్షికోత్సవ కార్యక్రమంలో భావనకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్, తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కరద్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న భావన దేశస్థాయిలో రెండో ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా భావన తల్లిదండ్రులు మహేశ్వరి, వైద్యనాథ్ (రాజు) పటేల్ మాట్లాడుతూ, తమ కుమార్తె దేశస్థాయిలో రెండో ర్యాంకు సాధించి అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడమే తల్లిదండ్రుల జీవితానికి నిజమైన సార్థకత అని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులైన చంద్రమ్మ, నాగిశెట్టి ఆశీస్సులతో పాటు, తమ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్న నేరడిగుంట గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతోనే ఇంతటి విజయాన్ని సాధించగలిగామని కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామానికి చెందిన భావన ఇంతటి గొప్ప అవార్డు అందుకోవడం పట్ల నేరడిగుంట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భావన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ, విదేశాల్లో గుర్తింపు పొందాలని, నేరడిగుంట గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో ప్రతిభతో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న పట్లోళ్ల భావనకు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నేరడిగుంట బిడ్డకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. భావనకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి