రోడ్డుపై అడ్డంగా పడిన ధాన్యం ట్రాక్టర్‌ను ఢీకొన్న డీసీఎం.
నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణ పరిధిలోని ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగేష్ హోటల్ నుంచి సూర్యాపేట వైపు వెళ్లే మార్గంలో రోడ్డుపై అడ్డంగా పడిపోయిన ధాన్యం ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను నకిరేకల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రహదారిపై ట్రాక్టర్ అడ్డంగా పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి