డ్రగ్స్‌కు నో చెప్పండి.. సురక్షిత భవిష్యత్తు కోసం పరుగెత్తండి.
రామన్నపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, సీఐ మెలుగు రవి సహకారంతో ఈ నెల 29న రామన్నపేటలో 2కే రన్ నిర్వహించనున్నట్లు ఎస్ ఐ గోపాతి సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు రామన్నపేటలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నుంచి రన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించనున్నట్లు చెప్పారు.మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని 2కే రన్‌ను విజయవంతం చేయాలని ఎస్ ఐ గోపాతి సతీష్ పిలుపునిచ్చారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి