పంచాయతీ కార్యదర్శి సంతకం, ముద్రల ఫోర్జరీ.. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లపై అనుమానాలు.
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో నకిలీ పంచాయతీ పన్ను రశీదుల వ్యవహారం కలకలం రేపుతోంది. రూ.500 ఇంటి పన్ను చెల్లించినట్లు రశీదు నంబర్ 1818తో నకిలీ రశీదు సృష్టించినట్లు గుర్తించిన పంచాయతీ కార్యదర్శి, తన సంతకం, కార్యాలయ ముద్రలను ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నకిలీ రశీదులను ఆధారంగా చేసుకుని గ్రామకంఠం, ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో నకిలీ పత్రాల సృష్టి వెనుక ఎవరున్నారు? వాటిని ఎక్కడెక్కడ వినియోగించారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు తక్షణమే స్పందించి, ఫోర్జరీకి పాల్పడినట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి