Sthanikam - Truth Matters
Logo

ముషంపల్లిలో ఘోర ప్రమాదం.. కంకర వాహనం ఢీకొని వలస కూలీ మృతి

Updated : 27 Oct 2026 15:47 IST
As Preferred Source 1 min read
ముషంపల్లిలో ఘోర ప్రమాదం.. కంకర వాహనం ఢీకొని వలస కూలీ మృతి

నల్లగొండ: నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా, ప్రమాదవశాత్తు కంకర వాహనం ఢీకొని బీహార్‌కు చెందిన వలస కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

ముషంపల్లిలో ఘోర ప్రమాదం.. కంకర వాహనం ఢీకొని వలస కూలీ మృతి

Article Image

నల్లగొండ: నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా, ప్రమాదవశాత్తు కంకర వాహనం ఢీకొని బీహార్‌కు చెందిన వలస కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి