యాదగిరిగుట్ట, అక్టోబర్ 27: జిల్లా స్థాయి చెస్ పోటీల్లో యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ గౌతమ్ హైస్కూల్ విద్యార్థినులు ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన పోటీల్లో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు విజయాన్ని సాధించారు.
అండర్-17 విభాగంలో 9వ తరగతి విద్యార్థిని ఐ.బి. సిరిచందన, అండర్-14 విభాగంలో 7వ తరగతి విద్యార్థిని భువన రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
విద్యార్థినులకు అభినందనలు
విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంపై పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ మిర్యాల దుర్గాప్రసాద్ వారిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థినుల విజయంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఈటీ పాండు పాల్గొన్నారు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి