Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

నవోదయ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Updated : 11 Nov 2026 19:29 IST
As Preferred Source 1 min read
నవోదయ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ పట్టణంలోని బాలాజీనగర్‌లో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయ భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన పనులు, నిర్మాణ పురోగతి, విద్యార్థులకు కల్పించనున్న మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్పీ నర్సింహా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నవోదయ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Article Image

కోదాడ పట్టణంలోని బాలాజీనగర్‌లో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయ భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన పనులు, నిర్మాణ పురోగతి, విద్యార్థులకు కల్పించనున్న మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్పీ నర్సింహా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి