నారాయణఖేడ్ నియోజకవర్గంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జి. సత్యం, ప్రధాన కార్యదర్శి కె. భూమయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని తెలిపారు. జర్నలిస్టుల సమావేశాలు, వృత్తిపరమైన అవసరాల కోసం నారాయణఖేడ్‌లో ప్రెస్ క్లబ్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయించి, సొంత భవన నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకరిస్తానని, జర్నలిస్టులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సభ్యుడు హసీబ్ పాటిల్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బి. రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. జావిద్, ఉపాధ్యక్షుడు నిసార్, కోశాధికారి రవీందర్, సంయుక్త కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అంబాదాస్, వ్యవస్థాపక కార్యదర్శి వీరరెడ్డి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యేకు జర్నలిస్టుల వినతి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి