Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

నార్కట్‌పల్లి నల్లగొండ క్రాస్ రోడ్డులో మెడికల్ షాప్‌లోకి దూసుకెళ్లిన లారీ

26-02-2026 473 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని నల్లగొండ క్రాస్ రోడ్డులో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ రహదారి పక్కన ఉన్న దీపక్ మెడికల్ షాప్‌లోకి దూసుకెళ్లింది. గాయపడిన వారి సంఖ్యపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, వేగంగా వస్తున్న లారీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న దుకాణాల వైపు మళ్లింది. ఈ క్రమంలో నల్లగొండ చౌరస్తాలో ఉన్న మెడికల్ షాప్‌ను ఢీకొట్టి లోపలికి చొచ్చుకుపోయింది. ప్రమాద సమయంలో షాప్‌లో కొంతమంది ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. . లారీ డ్రైవర్ పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ ప్రమాదంతో నల్లగొండ క్రాస్ రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు, వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

నార్కట్‌పల్లి నల్లగొండ క్రాస్ రోడ్డులో మెడికల్ షాప్‌లోకి దూసుకెళ్లిన లారీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News