Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:14 PM

నల్లగొండ మెడికల్ కళాశాల అభివృద్ధికి రూ.85 కోట్లు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

26-02-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవం

నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, నల్లగొండ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలల్లో నల్లగొండ కళాశాలను అత్యుత్తమంగా అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో నిర్మాణం స్లాబ్ దశలోనే నిలిచిపోయిందని, అనంతరం రూ.85 కోట్ల నిధులు కేటాయించి పనులను పూర్తి చేసి కళాశాలను ప్రారంభించామని వెల్లడించారు.

ప్రస్తుతం ఈ కళాశాలలో సుమారు 350 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని పేర్కొంటూ, రవాణా సౌకర్యం కోసం ప్రత్యేకంగా రెండు బస్సులను నెలలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

వైద్య విద్య పూర్తి చేసిన తరువాత మానవత్వాన్ని ప్రధానంగా భావించి సేవాభావంతో ప్రజలకు వైద్య సేవలు అందించాలని విద్యార్థులకు సూచించారు. అలాగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను మోడల్ నగరంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండ మెడికల్ కళాశాల అభివృద్ధికి రూ.85 కోట్లు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News