Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:33 AM

నకిరేకల్ 18వ వార్డులో బాలల సంరక్షణ దినోత్సవం

23-12-2025 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ 18వ వార్డులో బాలల సంరక్షణ దినోత్సవం

స్థానిక ప్రతినిధి నకిరేకల్

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 18వ వార్డులో బాలల సంరక్షణ దినోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ దైద స్వప్న–రవీందర్ అధ్యక్షత వహించారు.

సమావేశంలో వారు మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ప్రతి కదలికపై దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల భద్రత, భవిష్యత్ పరిరక్షణలో కుటుంబం, సమాజం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు శాఖ అధికారి వి. జనార్ధన్, ICDS సూపర్వైజర్ రేవతి, DCPU కౌన్సిలర్ సునీత, పోలీస్ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఎన్‌జీఓ ప్రతినిధులు, సమభావన సంఘాల కార్యకర్తలు, కాలనీ వాసులు, యువ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

నకిరేకల్ 18వ వార్డులో బాలల సంరక్షణ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News