Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:24 PM

మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీకి దిగజారిన హోదా

04-02-2026 178 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒకప్పుడు మున్సిపాలిటీ, తాలుకా కేంద్రం, శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా రామన్నపేట

1971లో మున్సిపాలిటీ హోదా రద్దు, గ్రామ పంచాయతీగా డిగ్రేడ్

1985లో తాలుకా రద్దుతో మండల కేంద్రంగా కొనసాగింపు

2009 నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేట నియోజకవర్గం రద్దు

సాధారణంగా గ్రామ పంచాయతీలు కాలక్రమేణా జనాభా, ఓటర్ల సంఖ్య, ప్రాంత అభివృద్ధికి అనుగుణంగా మున్సిపాలిటీలుగా మారుతుంటాయి. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట గ్రామం ఇందుకు భిన్నంగా పరిపాలనా మార్పులకు ఉదాహరణగా నిలిచింది.యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట ఒకప్పుడు మున్సిపాలిటీగా, తాలుకా కేంద్రంగా, శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా కొనసాగింది. ప్రస్తుతం మాత్రం ఈ గ్రామం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది.

రామన్నపేట 1971 సంవత్సరం వరకు మున్సిపాలిటీగా కొనసాగింది. అనంతరం ప్రభుత్వ నిర్ణయంతో మున్సిపాలిటీ హోదాను రద్దు చేసి గ్రామ పంచాయతీగా డిగ్రేడ్ చేశారు. అదే సమయంలో ఇది తాలుకా కేంద్రంగా కూడా ఉండేది. 1985లో తాలుకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో రామన్నపేట మండల కేంద్రంగా మారింది.

అలాగే రామన్నపేట గతంలో శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా కూడా ఉంది. 2009లో జరిగిన శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేట నియోజకవర్గాన్ని రద్దు చేసి, నకిరేకల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి చేర్చారు.ఒకప్పుడు పరిపాలనా, రాజకీయ ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా ఉన్న రామన్నపేట మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీగా మారిన తీరు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీకి దిగజారిన హోదా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News