Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మంజూరైన బీసీ హాస్టల్‌ను వెంటనే ప్రారంభించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

Updated : 31 Oct 2026 17:15 IST
As Preferred Source 1 min read
మంజూరైన బీసీ హాస్టల్‌ను వెంటనే ప్రారంభించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

చౌటుప్పల్‌ ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నా.. వినతిపత్రం అందజేత

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన బీసీ విద్యార్థుల వసతి గృహాన్ని (హాస్టల్) వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌డీవోకు వినతిపత్రం అందజేశారు.​ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హాస్టల్ మంజూరై మూడు నెలలు గడుస్తున్నా ప్రారంభించకపోవడం అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి, విద్యార్థుల వివరాల పరిశీలన పూర్తయ్యాక నెల రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో చూపలేదన్నారు. కరోనా సమయంలో మూతపడిన హాస్టల్‌కు ఇప్పటికీ తాళాలు వేసే ఉండటం బాధాకరమన్నారు. చౌటుప్పల్ ఏడు మండలాలకు కేంద్రంగా ఉందని, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది పేద విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారని పేర్కొన్నారు. ప్రయాణ ఖర్చులు భరించలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ హాస్టల్ ప్రారంభమైతే వారికి ఎంతో ఊరట లభిస్తుందని తెలిపారు.​అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడం విచారకరమని, ఇప్పటికైనా కలెక్టర్, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిధులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించి హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులను సమీకరించి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు బండారి విక్రమ్, తిరుగి వరుణ్ తేజ్, సుర్వి అరవింద్, నాయకులు శివ, వంశీ, నితిన్, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మంజూరైన బీసీ హాస్టల్‌ను వెంటనే ప్రారంభించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news