Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:06 AM

మన్సూర్‌పూర్‌లో మహిళా సమాఖ్య సమావేశం – స్వయం ఉపాధిపై అవగాహన

13-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పురపాలక సంఘం పరిధిలోని మెప్మా విభాగం ఆధ్వర్యంలో నారాయణఖేడ్ పట్టణ సమాఖ్యకు చెందిన 8వ వార్డు మన్సూర్‌పూర్ స్లమ్ సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ హాజరై మహిళలకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగాలని, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించుకోవాలని సూచించారు. ఆ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ సమయానికి బ్యాంకు రుణాలను తిరిగి చెల్లిస్తే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు. మహిళలు సంఘాల ద్వారా కలిసికట్టుగా పనిచేస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, గౌరవ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ జేగ్జీవన్, మున్సిపల్ మేనేజర్, మెప్మా విభాగానికి చెందిన పట్టణ సమన్వయకర్త, సమాఖ్య ప్రతినిధులు, సమాఖ్య బాధ్యతదారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో మహిళల సమస్యలు, వ్యాపార అవకాశాలు, సంఘాల బలోపేతం వంటి అంశాలపై చర్చించారు.

Sthanikam

మన్సూర్‌పూర్‌లో మహిళా సమాఖ్య సమావేశం – స్వయం ఉపాధిపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News