Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:05 AM

మద్యపానానికి బంద్… పెద్దారెడ్డిపేట్ గ్రామంలో సంచలన నిర్ణయం

18-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని పెద్దారెడ్డిపేట్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి అనసూజ లింగయ్య ఒక ప్రకటనలో ముఖ్యమైన నిర్ణయాన్ని వెల్లడించారు.గ్రామంలో శాంతి, ఆరోగ్యం మరియు కుటుంబ సౌఖ్యం కాపాడే లక్ష్యంతో ఉగాది పండుగ నుండి మద్యపాన నిషేధాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.గ్రామంలో మద్యపానం కారణంగా కుటుంబాల్లో కలహాలు, ఆరోగ్య సమస్యలు,ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని గుర్తించిన గ్రామ పెద్దలు మరియు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ నిర్ణయానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని,గ్రామాభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.అదేవిధంగా,మద్యపానం నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని,నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Sthanikam

మద్యపానానికి బంద్… పెద్దారెడ్డిపేట్ గ్రామంలో సంచలన నిర్ణయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News