Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:22 PM

లక్ష్యాలతో ముందుకు సాగి అన్ని రంగాల్లో విజయం సాధించాలి

01-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు అన్ని రంగాల్లో ముందంజలో నిలిచి సుఖసంతోషాలతో జీవించాలని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకాంక్షించారు. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్భంగా నారాయణఖేడ్ సబ్ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిలో తమకంటూ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, ప్రణాళికాబద్ధంగా వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. కొత్త ఆలోచనలు, మంచి నిర్ణయాలు, ఉన్నత ఆశయాలతో 2026 సంవత్సరాన్ని ప్రారంభించాలని అన్నారు. గత సంవత్సరం కంటే మరింత మెరుగైన విజయాలను సాధిస్తూ వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవాలని కోరారు. నారాయణఖేడ్ సబ్ డివిజన్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో కొత్త ఏడాదిని స్వాగతించాలి ఆకాంక్షిస్తూ నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

లక్ష్యాలతో ముందుకు సాగి అన్ని రంగాల్లో విజయం సాధించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News