Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Updated : 06 Nov 2026 13:24 IST
As Preferred Source 1 min read
కోదాడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు, నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

పనుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యూజీడీ పనులు చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Sthanikam

కోదాడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Article Image

కోదాడ పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు, నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

పనుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యూజీడీ పనులు చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి