చిట్యాల: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయన క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఏపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెలిమినేడు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద శుక్రవారం పూజా కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఏపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శేఖర్, మాజీ ఉపసర్పంచ్ లింగస్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజనేయస్వామిని ప్రార్థించారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం క్షేమంగా ఉండాలని ప్రత్యేక పూజలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి