భారతీయ మాజీ సైనికుల సంస్థ (IVO) తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడలో ప్రత్యక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు వెటరన్ డా. గుండా మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. సంస్థ బలోపేతం, కొత్త సభ్యుల చేరిక, మాజీ సైనికులు, వీర నారీలు, వారి కుటుంబాల సంక్షేమంపై చర్చించారు. గ్రామస్థాయి వరకు సంస్థను విస్తరించాలని, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 2027 జనవరి 25, 26 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి కార్యక్రమాల కోసం SPARK కమిటీని ఏర్పాటు చేశారు. ఐక్యత, క్రమశిక్షణ, సేవాభావంతో సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు.
కోదాడలో మాజీ సైనికుల ఐక్యతకు పిలుపు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి