యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జ్యోతిబాపూలే విగ్రహం వద్ద, బీసీల జనభేరి గోడపత్రికలను బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మేరకు.డిసెంబర్ 14 15 న, ఢిల్లీలో
బీసీల జనబేరి గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో, జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి మాట్లాడుతూ..
రాబోయే జనవరి నెలలో కేంద్రం చేపట్టే సందర్భంలో బీసీ కాలమ్ ను చేర్చాలని, డిమాండ్తో ఢిల్లీలో డిసెంబర్ 14-15న రాంలీల మైదానంలో బీసీల జనభేరి సభకు జిల్లా వ్యాప్తంగా బీసీలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో,
భువనగిరి నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్, మాజీ ఎంపీపీ అధికం లక్ష్మీనారాయణ గౌడ్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు అశోక చారి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు కుక్కదువు సోమయ్య, కౌన్సిలర్ చీమల రాజు యాదవ్,ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు ఎనబోయిన జాంగిర్, ప్రధాన కార్యదర్శి నీల శ్రీనివాస్ ముదిరాజ్, యాదవ సంఘం నాయకులు నక్కల చిరంజీవి యాదవ్, హరికిషన్, సురేష్ యాదవ్, మహంకాళి సురేష్ చారి, తదితర బీసీ కుల సంఘాల నాయకులు వివిధ పార్టీలకు చెందినది నాయకులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి