Sthanikam - Truth Matters
Logo

అభివృద్ధికి ఆమడదూరంలో 10వ వార్డు!

Updated : 29 Nov 2026 10:35 IST
As Preferred Source 1 min read
అభివృద్ధికి ఆమడదూరంలో 10వ వార్డు!

శంకుస్థాపనకే పరిమితమైన సీసీ రోడ్డు పనులు.. 11 నెలలైనా ప్రారంభం కాని వైనం

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి 11 నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదని వాపోతున్నారు.

మున్సిపాలిటీలోని ఇతర వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండగా, 10వ వార్డును మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన సమయంలో ఎంతో ఆశపడ్డామని, కానీ నెలలు గడుస్తున్నా పనుల్లో కదలిక లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి 10వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

అభివృద్ధికి ఆమడదూరంలో 10వ వార్డు!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి