Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఆసుపత్రి సిబ్బందిపై రోగి బంధువుల దురుసు ప్రవర్తన

Updated : 29 Nov 2026 15:05 IST
As Preferred Source 1 min read
ఆసుపత్రి సిబ్బందిపై రోగి బంధువుల దురుసు ప్రవర్తన

పోలీసులకు ఫిర్యాదు చేసిన సూపరింటెండెంట్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

స్థానిక ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై రోగి బంధువులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడిన ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వై. సూర్యశ్రీ రావు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

​ఈ నెల 27వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో తొమ్మిది నెలల గర్భిణి సిలివేరు శ్రీవాణి (21) ప్రసవం నిమిత్తం చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య సిబ్బంది ఆమె భర్త బుర్ర శివకుమార్‌కు వివరిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై సిబ్బందిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు.

​ఈ ఘటనతో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఆసుపత్రిలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగిందని సూపరింటెండెంట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాత్రి వేళల్లో కొందరు మద్యం మత్తులో ఆసుపత్రికి రావడం, ఒక రోగి వెంట ఎక్కువ మంది బంధువులు గుమిగూడి సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది ఎలాంటి భయాందోళనలు లేకుండా విధులు నిర్వహించేలా ఆసుపత్రి వద్ద పోలీసు అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని, లేదా రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని కోరుతూ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేశారు.

Sthanikam

ఆసుపత్రి సిబ్బందిపై రోగి బంధువుల దురుసు ప్రవర్తన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి