Sthanikam - Truth Matters
Logo

ఖాకీ చాటిన మానవత్వం!

Updated : 29 Nov 2026 15:05 IST
As Preferred Source 1 min read
ఖాకీ చాటిన మానవత్వం!

తల్లి ఎస్సై పరీక్ష రాసేందుకు.. చిన్నారికి అమ్మగా మారిన హెడ్‌ కానిస్టేబుల్‌

నల్గొండ: విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్నారు ఓ పోలీసు అధికారి. ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు చిన్నారితో వచ్చిన ఓ మహిళకు కుటుంబ సభ్యులెవరూ తోడుగా లేకపోవడంతో ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని గమనించిన డిండి మండలానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ షర్ఫ్‌ ఉద్దీన్‌ వెంటనే స్పందించారు. చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకొని చూసుకుంటూ, తల్లిని పరీక్ష రాసేందుకు కేంద్రంలోకి పంపించారు. తల్లి పరీక్ష రాసి వచ్చే వరకు చిన్నారికి అండగా నిలిచారు. ఖాకీ దుస్తుల వెనుక దాగి ఉన్న మంచి మనసును చాటిన షర్ఫ్‌ ఉద్దీన్‌ సేవాభావంపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

ఖాకీ చాటిన మానవత్వం!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి