జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్‌తో పాటు పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ఆలయ పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన బీఎస్ వీర్ శెట్టిని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు శంకరయ్య స్వామి ప్రత్యేకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి నూతన పాలక మండలి సభ్యులందరూ సమష్టిగా కృషి చేయాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించేలా ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, హుగ్గెల్లి రాములు, భాస్కర్ రెడ్డి, సువర్ణ–మల్లన్న పాటిల్, పవన్ రాథోడ్, మాజీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్షద్ అలీ, బడంపేట్ రాచన్న స్వామి ఆలయ కమిటీ చైర్మన్ జగదీష్ స్వామి, కాంగ్రెస్ నాయకులు ముల్తానీ, ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి