Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:25 PM

కాలేజీ ముందు మారిన రూపు రేఖలు … సర్పంచ్ గరిక సత్యనారాయణ

30-01-2026 903 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు అస్తవ్యస్తంగా ఉన్న పాత డబ్బాలు, పనికిరాని నిర్మాణ అవశేషాలు, అడ్డంకిగా మారిన పాత చెట్లను తొలగించారు. యంత్రాల సహాయంతో స్థలాన్ని పూర్తిగా చదును చేయడంతో కళాశాల పరిసరాలు క్రమబద్ధంగా మారాయి.

విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ గరిక సత్యనారాయణ తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచనల మేరకు రామన్నపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, గ్రామాభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గం సమిష్టిగా పనిచేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. గ్రామ అభివృద్ధికి ఇది మరో ముందడుగుగా గ్రామస్తులు పేర్కొన్నారు.

Sthanikam

కాలేజీ ముందు మారిన రూపు రేఖలు … సర్పంచ్ గరిక సత్యనారాయణ

Article Image

మీ స్పందన? 6 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News