Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

Updated : 20 Nov 2026 17:53 IST
As Preferred Source 1 min read
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల పరిధిలోని యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లి, సైదాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలకు పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడకూడదనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, మరణించినా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

నవంబర్ 19 నుంచి ప్రారంభించిన ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబంలోని సంపాదించే వ్యక్తికి జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు మరణించిన సందర్భంలో వారి నామినీలకు ప్రభుత్వం రూ.5 లక్షల బీమా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు.ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు కూడా నిబంధనల ప్రకారం ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించనున్నట్లు తెలిపారు.

ప్రైవేటు బీమా సంస్థల ద్వారా అర్హులైన వారికి బీమా సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పథకానికి సంబంధించి ఆధార్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు, మొబైల్ నంబర్ తదితర అవసరమైన వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు తెలిపారు.

Sthanikam

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి