మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ఏళ్లనుంచి వేధిస్తున్న పెద్ద మోరి (డ్రైనేజీ) సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. విద్యానగర్ నుంచి శాంతినగర్ రేషన్ షాప్ వరకు తీవ్రంగా ఉన్న ఈ సమస్యపై ఇటీవల స్థానికులు పురపాలక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ కి వినతిపత్రం అందజేశారు. బాధితుల సమస్యపై తక్షణమే స్పందించిన చైర్మన్.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు నెలల వ్యవధిలోనే మోరి నిర్మాణ పనులను ముమ్మరంగా ప్రారంభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ పాక చిరంజీవి కి 12వ వార్డు కాలనీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
హామీ నెరవేర్చిన చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్.. 12వ వార్డులో డ్రైనేజీ పనులు ప్రారంభం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి