Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నీలం మధుకు అవకాశం కల్పించాలి: కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్

Updated : 17 Oct 2026 19:00 IST
As Preferred Source 1 min read
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నీలం మధుకు అవకాశం కల్పించాలి: కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించాలని నారాయణఖేడ్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్ కోరారు.తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన రాజకీయ గుర్తింపు, ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నీలం మధు ముదిరాజ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ,ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలుస్తూ, ‘అన్నా అంటే నేనున్నాను’ అనే భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నీలం మధు ముదిరాజ్ సేవలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. బీసీ సామాజిక వర్గాలు రాజకీయంగా మరింత బలోపేతం కావాలంటే చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడం అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గణనీయమైన జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా ఆ వర్గం అభివృద్ధికి మరింత దోహదపడుతుందని తెలిపారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్,కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నీలం మధు ముదిరాజ్‌కు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవిని కేటాయించి, బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం కల్పించాలని బాణపురం రాజు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నీలం మధుకు అవకాశం కల్పించాలి: కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి